Header Banner

యూట్యూబర్ లోకల్‌బాయ్ నానీపై కేసు నమోదు! కారణం ఏంటో తెలుసా..!

  Sat Feb 22, 2025 17:58        Others

సాధారణంగా ఫాలోవర్స్ ఎక్కువైతే వాళ్లు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మారతారు. వాళ్లకున్న ఫాలోవర్స్‌ని బట్టి ఆయా సంస్థలు వాళ్లను ప్రమోషన్‌కి వాడుకుంటాయి. ఆ చేసేదేదో మంచి ప్రమోషన్స్‌ అయితే ఇబ్బంది లేదు. కానీ లోకల్‌బాయ్‌ నానీ మాత్రం తన యూట్యూబ్ చానల్‌ ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తుంటాడు. దేశంలో ఇది చట్టరీత్యా నేరం. ఆ ప్రమోషన్ కూడా ఓ డ్రామాలా క్రియేట్ చేస్తారు. అమాయకులు, డబ్బు మీద అత్యాశ ఉన్నవాళ్లు వాటికి ఎట్రాక్ట్‌ అయితే.. అంతే సంగతులు. ఇప్పటికే చాలామంది యువతులు బెట్టింగ్ యాప్‌లలో నష్టపోయి సూసైడ్స్‌ చేసుకున్న ఘటనలు చూశాం. అయినా నానీ లాంటి స్వార్థపరులు వాళ్లకొచ్చే ప్రమోషన్ డబ్బు కోసం ఇలా వీడియోస్ చేయడం సహజమైపోయింది. నానీ ప్రమోషన్స్‌ని గతంలోనే తెలంగాణ కేడర్ IPS అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రశ్నించారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 


సమాజానికి చీడలా తయారయ్యారని, ఎవరూ ఇలాంటి వాళ్ల ప్రమోషన్స్‌ చూసి బలి కావద్దని సూచించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విశాఖలో యూట్యూబర్ లోకల్‌బాయ్ నానీపై కేసు నమోదైంది. బెట్టింగ్‌ యాప్‌లు ప్రమోట్‌ చేస్తుండడంతో క్రిమినల్ చర్యలకు సిద్ధమయ్యారు.అతని ప్రమోషన్స్‌పై AIYF యూత్‌ వింగ్‌ విశాఖ పోలీస్ కమిషనర్ శంకబత్ర బాగ్చీకి ఫిర్యాదు చేసింది. ఆయన వాటిపై ఆరా తీసి.. చట్టపరమైన రూల్స్ అతిక్రమించాడని నిర్ధారించారు. అతనిపై క్రిమినల్‌ చర్యలకు సిద్దమయ్యారు. నానీ వీడియోస్‌, ప్రమోషన్స్‌ను వీక్షించిన సీపీ శంకబత్ర బాగ్చీ, నానీ ప్రమోట్‌ చేస్తున్న బెట్టింగ్ యాప్‌లో పాల్గొంటే ఇల్లు గుల్లే! అని గుర్తించారు. స్వార్థం కోసం అమాయకులను బలిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, నానీ తరహా ఆలోచనల్లో ఉన్నవాళ్లకు జాగ్రత్త అంటూ సీపీ శంకబత్ర బాగ్చీ వార్నింగ్ ఇచ్చారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #influencer #youtuber #todaynews #flashnews #latestupdate